కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా.. లోకేష్ కౌంటర్ వేశాడుగా!

Monday, June 4th, 2018, 04:35:04 PM IST

ఆంధ్రప్రదేశ్ నాయకుల మధ్య మాటల యుద్ధం ఇటీవల తార స్థాయికి చేరుతోంది. ప్రతి ఒక్కరు ఎవరి స్టైల్ లో వారు మాటల తూటాలు పేలుస్తూ చర్చనీయంగా మారుస్తున్నారు. జగన్ తన ప్రజా సంకల్ప యాత్రతో ప్రతి ఊరును టచ్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ తీరును ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరుగుతోందని నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైసీపీకి ఓటెయ్యాలని చెబుతుండడంతో ఎప్పటికప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అయితే మంత్రి లోకేష్ ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా జగనా పై కౌంటర్లు వేయడం వైరల్ గా మారుతోంది. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా చెప్పబడే ఒక వ్యక్తి, 13 కేసుల్లో ఏ1, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు. వారి పార్టీలో ఉన్న నేతలంతా కూడా మర్డర్లు – కిడ్నాపులు, భూకబ్జాలు, ఎర్ర చందనం స్మగ్లింగ్, బెట్టింగ్.. వంటి నేరాల్లో ఆరితేరినవారు. ఈ స్థాయిలో చరిత్ర కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నేరాల గురించి మాట్లాడతారని కౌంటర్ వేశారు. అదే విధంగా ఆయన తండ్రి అధికారంలో నెలకొన్న క్రైమ్ రేటును ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అణచివేశారని లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments