రేవంత్ ఢిల్లీకి అందుకే వెళ్లారు.. క్లారిటీ ఇచ్చిన లోకేష్

Wednesday, October 18th, 2017, 01:05:06 PM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయాల సెగ తెలంగాణకు కనెక్ట్ అయ్యింది. ఇక్కడ తెలుగు దేశం పార్టీలో తేడా వస్తే అక్కడ అధికార పార్టీలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ చాలా వరకు వెనుకబడిపోయింది. అగ్ర నేతలంతా అధికార టీఆరెస్ లోకి జంప్ అవ్వడంతో టీడీపీ పరిస్థితి ప్రస్తుతం చాలా కష్ట కాలంలో ఉంది. అయితే తెలంగాణాలో ఎలాగైనా పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తేవాలని చంద్రబాబు ఆలోచిస్తుంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి పార్టీ లో నుంచి వెళ్లిపోతున్నారని అనేక రూమర్స్ వచ్చాయి. ఆయన తెలంగాణ ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని అందుకోసమే ఢిల్లీ వెళ్లారని చాలా కామెంట్స్ వినిపించాయి. అయితే విషయంపై రీసెంట్ గా నారా లోకేష్ స్పందించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, వస్తున్న వార్తలన్నీ అబద్దమని చెప్పారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి కోర్టు పని నిమిత్తం మాత్రమే ఢిల్లీ వెళ్లానని చెప్పినట్లు లోకేష్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments