మోదీ ట్వీట్ కి లోకేష్ కౌ౦టర్..!

Monday, June 4th, 2018, 02:39:21 PM IST

ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే దానికి మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం హామీలను అమలు చెయ్యకుండా తమకు ఆన్యాయం చేసిందని ఏపీ ప్రజలు ఆవేదనలో ఉండగా, ప్రధాని తమ శుభాకాంక్షలతో ప్రజలను సంతృప్తిపరచలేరని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని లోకేష్‌ ట్విట్ చేశారు.

ఇప్పటికైనా ప్రజల ఆవేదనను, మనోభావాలను మోదీ అర్థం చేసుకోవాలని కోరుకున్నారు. అయితే మోదీ శుభాకాంక్షలు పై కొంతమంది ట్వీటర్ ద్వారే నిరసన తెలిపారు. ఏపీకి అన్యాయం చేసి, మళ్ళి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు ఎందుకు అని ఎదురు కామెంట్లు పెట్టారు. దాంతో ప్రజల కామెంట్లను జత చేసి లోకేష్‌ ప్రధానికే ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments