మళ్లీ బుక్ అయిన చిన బాబు – నెటిజన్ల ట్రోలింగ్..!

Tuesday, November 6th, 2018, 09:56:48 AM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మాట జారడం, అర్థం లేకుండా మాట్లాడటం, సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోవడం ఆయనకు అలవాటే. తాజాగా శ్రీకాకుళం తితిలి తుఫాన్ గురించి ఒక పోస్ట్ చేసాడు, “తితిలి పై విజయం” అంటూ పోస్ట్ చేసాడు. నిజానికి తుఫానుకు సంబంధించి చంద్రబాబు అండ్ కో చేసిన పబ్లిసిటీ స్టెంట్లు అన్ని ఇన్ని కావు, ఈ రోజుకి కూడా కొన్ని చానళ్ల చర్చ కార్యక్రమాలలో ” చంద్రబాబు తుఫానులోకి దూకారు” అంటూ టీడీపీ నేతలు ఆయనని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిజమే, చంద్రబాబు తుఫానులోకి దూకారు ఆ సమయంలో అక్కడే మకాం వేశారు. కానీ, ఆయన సేఫ్, అక్కడి ప్రజలు మాత్రం బేజార్. అక్కడ చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన ఫీట్లు మామూలుగా లేవు. అంతే కదా రాజకీయం అంటే మరి.

చంద్రబాబు అన్ని ఫీట్లు చేస్తుంటే లోకేష్ ఇంకెన్ని చేయాలి, అందుకే ఓ అడుగు ముందుకేసి తితిలి “తుఫాను పై విజయం” అంటూ పోస్ట్ చేసాడు. ఇంకేముంది నెటిజన్లకు పండగ, తుఫాన్ పై విజయం ఏంటీ అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ పవన్ ను కూడా వదల్లేదు, అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న దత్త పుత్రుడు ఆధారాలు చూపించాలి అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ దాచిపెట్టాడో చెప్పాలంటూ నిలదీసాడు. దీనికి జనసేన సానుభూతి పరులు కాంటర్లు కూడా ఇస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments