మరో సారి వైసిపి పై విరుచుకుపడ్డ లోకేష్ !

Tuesday, April 24th, 2018, 03:04:45 AM IST

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోదా ఉద్యమం తీవ్రతరం సాగుతోంది. ఓవైపు టిడిపి మరో వైపు ప్రతిపక్ష వైసిపి హోదా కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పు చందాన వ్యవహారం ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్ర బాబు చేపట్టనున్న హోదా కోసం దీక్ష కార్యక్రమానికి ధీటుగా అదే రోజు వైసిపి నేతలు కూడా దీక్ష చేయడం హాస్యాస్పదం అని ఐటి మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా లో ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. అసలు బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ఎవ్వరు మర్చిపోలేరని, అటువంటి బిజెపి ఇప్పుడు శత్రువుకి, శత్రువు మిత్రుడే అనే చందాన వైసిపి తో కుమ్మక్కయి ఈ విధంగా వ్యవహరిస్తోందని అందుకే జగన్ కూడా బిజెపితో రహస్య లాలూచి చేసుకుని వారిపై మాట పడనివ్వకుండా చూస్తున్నారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

హోదా అనేది ఏపీ కి హక్కు అని, ఆ హక్కుని కాలరాసే అధికారం కేంద్రానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసిపి బిజెపి నేతల మధ్య వున్నా మైత్రి బయటపెట్టాలని ఆయన హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఏమి చేసినా ఎవరు ఏమిటి అనేది ప్రజలకు తెలుసునని, జైలుకు వెళ్లివచ్చిన పార్టీ నేతలతో తాము సలహాలు తీసుకునే పరిస్థితులలో లేమని ఆయన మండిపడ్డారు…….

  •  
  •  
  •  
  •  

Comments