అస్సలు పోలిక లేదు..కేసీఆర్ పై లోకేష్ సెటైర్..!

Sunday, January 21st, 2018, 04:27:53 PM IST

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నుంచి ఎపి టీడీపీ నేతలందరికీ ఆగ్రహం తెప్పించేలా చేసాయి. అసలు అభివృద్ధిలో ఏపీకి తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ తేల్చేశారు. తెలంగాణ స్వాతంత్రం కంటే ముందు నుంచే సంపన్న ప్రాంతం అని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే తెలంగాణ దేశంలోనే నెం 1 కాబోతోందని వివరించిన సంగతి తెలిసిందే. సాటి తెలుగు రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా మంత్రి లోకేష్ కేసీఆర్ పై సెటైర్ పేల్చారు. కేసీఆర్ చెప్పింది నిజమే. అభివృద్ధిలో ఏపీకి, తెలంగాణకు అసలు పోలిక లేదు. ఆంద్రప్రదేశ్ కు కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ మరియు అపోలో టైర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని తెలిపారు. తెలంగాణాలో ఇటువంటి పరిస్థితి లేదు కదా.. అందుకే ఏపీకి తెలంగాణ కు పోలిక లేదని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.