ఆ రెండు పార్టీల నేతల కలయికపై లోకేష్ సెటైరికల్ ప్రశ్న!

Friday, June 15th, 2018, 07:53:10 AM IST

2019 ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల పోరు అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరోవైపు వైసిపి అధినేత జగన్ ప్రజల్లో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే ఆలోచనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఐటి, మరియు పంచాయితిరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు వైసిపి నేతలపై ఛలోక్తులు విసిరారు. నిన్న ఒక భేటీలో భాగంగా వైసిపి నేతలు ఏపీ బిజెపి నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారు. వారు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిసే విషయమై ఒక వీడియో మీడియా చేతికి చిక్కడంతో,

దానిపై స్పందించిన లోకేష్, వైసిపి నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో ఎటువంటి లాలూచీకి సిద్ధమయ్యారని సెటైరికల్ గా ఒక ప్రశ్న సంధించి, దానికి నాలుగు అషన్స్ కూడా ఇచ్చారు. ఒకటి ఆపరేషన్ గరుడ, రెండవది జగన్ కేసులు మాఫీ, మూడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకా, నాలుగు పైవి అన్నీ. ఇలా నాలుగు అషన్లు ఇచ్చి వైసిపి నేతలను ప్రశ్నించారు. కాగా ఇటీవల వైసిపి నేతలు బిజెపి జాతీయ స్థాయి అగ్రనేతలతో కూడా భేటీఅయ్యారని, వైసిపి బీజేపీ తో కుమ్మక్కయి రహస్య ఎజండాతో మాపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తోంది అని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదని ఎద్దేవా చేశారు. అయితే వైసిపి నేతలు అయన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments