లోకేష్ సంచలన వాఖ్యలు – బీజేపీ కి సినిమానే ఇక

Friday, January 11th, 2019, 05:10:05 PM IST

ఏపీ మంత్రి నారా లోకేష్ బీజేపీ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ పార్టీ కి ఏపీ ప్రజలుతగిన బుద్ది చెబుతారని, కర్ణాటకలో ప్రజలు బీజేపీ కి కేవలం ట్రైలర్ మాత్రమే చూపించారని, కానీ ఏపీ ప్రజలు బీజేపీ కి సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభలో ప్రసంగించిన లోకేష్ బీజేపీ పైన నిప్పుల వర్షం కురిపించారు.

ప్రజలు ఎంతగానో నమ్మకం పెట్టుకున్న మోడీ చాలా మోసం చేశారని, మోడీ ఒక మోనార్క్ లా మారాడని లోకేష్ అన్నారు. ఏపీ లో జరిగే ఎన్నికల తరువాత దేశ ప్రధాని ఎవరు అనేది చంద్రబాబు నిర్ణయిస్తాడని లోకేష్ అన్నారు. జగన్‌‌తో కలిసి మోదీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా అని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో.. జగన్ మోదీపై ఒక్క విమర్శ చేయలేదని గుర్తుచేశారు. జగన్‌పై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మల్లి ఏపీ లో రానున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని, అందుకోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు.