జ‌న‌సేనానికి లోక్‌స‌త్తా మ‌ద్ద‌తు దేనికి సంకేతం?

Sunday, February 10th, 2019, 10:18:22 AM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు పెరుగుతోంది. మంచి కోరే మ‌చ్చ‌లేని నాయ‌కులంతా ప‌వ‌న్ చుట్టూ చేరుతుండ‌టం శుభ‌ప‌రిణామం. రాజ‌కీయ ప్ర‌క్షాళ‌నే ప్ర‌ధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న జ‌న‌సేనా అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై లోక్‌స‌త్తా అధినేత ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న లాంటి వాళ్లంతా ప‌వ‌న్‌కు అండ‌గా నిల‌వాల‌ని స్వ‌యంగా జ‌య‌ప్ర‌కాష్‌నారాయ‌ణ చెప్పడం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వ్య‌క్తులు, పార్టీ గురించి నేను మాట్లాడ‌ను. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నాకకు మంచి మిత్రుడు. మంచి కోసం ఎవ‌రు ముందుకు వ‌చ్చినా మ‌ద్ద‌తివ్వాలి. అంటూ ఆయ‌న ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

జ‌న‌సేనా అధినేత పవ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో మార్పు కోసం జ‌నాల్లోకి రావ‌డం ప‌ట్ల మీ స్పంద‌న ఏమిట‌ని ఓ విలేఖ‌రి ప్ర‌శ్న‌కు స‌మాధానంగా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్తశుద్దిగల నేత. ఆయ‌న‌ను ఏ వ‌ర్గం వారైనా న‌మ్ముతారు. ప‌వ‌న్ స‌మాజంలో మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నారు. అలాంటి వ్య‌క్తి ముంద‌కొచ్చిన‌ప్పుడు అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం. ప్ర‌తి పార్టీలోనూ మంచీ చెడు రెండూ వున్నాయ‌ని, దాని గురించి నేను మాట్లాడ‌ద‌ల్చుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. దొంగ‌లు దొంగ‌లు ప‌డి దేశాన్ని దోచుకున్నారు అన్న చందంగా తేదేపా, కాంగ్రెస్, వైసీపీ వంటి పార్టీల మ‌నుగ‌డ మునుముందు ఏపీలో క‌ష్టం అయ్యేలా ఉచ్చు రెడీ అవుతోందా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి. అయితే అంతిమంగా ఓట‌రు ఎటువైపు మొగ్గు చూపుతాడు? అన్న‌దే ఫేట్ ని డిసైడ్ చేస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు.