సినిమా చేద్దాం అనే మాట కోసమే ఎదురు చూస్తున్నా..

Wednesday, December 5th, 2018, 10:50:30 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందన్న సంగతి మనకు తెలిసిందే. రజినీకాంత్ ప్రస్తుతం పేట చిత్రీకరణలో ఉన్నాడు. ఆ చిత్రం పూర్తవడం తోనే మురుగదాస్ తో సినిమా చేయనున్నాడని మురుగదాస్‌ వెల్లడించారు. రజిని సార్ తో ఫ్యాంటసీ సినిమా తీయబోతున్నట్లు మురుగదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘నేను రజనీని కలిసి స్క్రిప్టు వినిపించాను. ఆ కథ బాగా నచ్చిందని ఆయన చెప్పారు. కానీ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు ఉన్నట్లుండి మారిపోతుంటాయి. అందుకోమనే ‘సినిమా చేద్దాం’ అని రజనీ ఫోన్‌ చేస్తారని ఎదురుచేస్తున్నా’ అని మురుగదాస్ వెల్లడించారు.

మురుగదాస్ మాట్లాడుతూ ‘నా తర్వాతి సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండదు. నా గత చిత్రం సర్కార్‌ కూడా రాజకీయ నేపథ్యం గానే వచ్చింది. ఇలాంటి సినిమాలనే తీస్తూ పోతుంటే బోర్ కొట్టేస్తుంది. ‘ఈ దర్శకుడు ఒకేరకం సినిమాలు తీస్తున్నాడ’ని ప్రేక్షకులు తప్పుగా అనుకుంటారు. నేను రజనీ కోసం రాసిన స్క్రిప్టు ఫ్యాంటసీ సినిమా కోసం. కొన్ని మీటింగ్స్‌ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ప్రకటిస్తాం’ అని మురుగదాస్ చెప్పారు. ఈ చిత్రం 2019 మార్చ్ లో పట్టాలెక్కనున్నదని చిత్రవర్గ సమాచారం.