అయ్యారే..విచిత్రాలన్నీ ఇక్కడే..!

Friday, September 12th, 2014, 12:01:50 PM IST


ఈ ఫాస్ట్ ప్రపంచలో ఏదైనా సాధ్యమే..ఉన్నదాన్ని లేనట్టు.. లేనిదాన్ని ఉన్నట్టు సృష్టించి తికమకపెట్టొచ్చు.అంతేకాదండోయ్ తిక్కరేగిందంటే ఏకంగా దేవుడికే ఆధార్ కార్ట్ సృష్టిస్తాం. అవునండి.. ఇదేదో సరదాకి చెప్పడం లేదు.. నిజంగా జరిగింది.. మనోళ్ళు ఏకంగా వాయుపుత్రుడు ఆంజనేయుడి పేరా ఆధార్ సృష్టించారు.. అంతేకాదండోయ్.. ఆయనకు సెల్ ఫోన్ నెంబరు కూడా ఉన్నదంట.. ఇక వివరాలలోకి వెళ్తే..
బెంగళూరు నుంచి రాజస్తాన్ లోని దంతరాంఘడ్ ప్రాంతానికి సెప్టెంబర్ 6 న ఓ కార్డు వచ్చింది. అయితే, ఆ కార్డు పట్టుకొచ్చిన పోస్ట్ మెన్ హీరాలాల్, అందులో ఉన్న అడ్రస్ అర్ధం కాక తికమక పడ్డాడు. చివరకు అసలు విషయం తెలుసుకొని ఖంగుతిన్నాడు. అంతేనా అనకండి.. ఇంకా ఉన్నది.. కార్డు మీద ఉన్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేస్తే.. అదికాస్తా స్వేచ్ ఆఫ్ అని వచ్చిందంట.. ఇక చేసేది లేక పాపం ఆ పోస్ట్ మెన్ హీరాలాల్ ఆ కవరును తిప్పి పంపాడు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఆంజనేయుడి తండ్రిపేరు పవన్ అని అందులో పేర్కొన్నారు. ఆంజనేయుడి ఫోటోతో పాటు.. ఆయన వేలుముద్రను కూడా ఆ కార్డుమీద ఉండటం విశేషం. ఈ కార్డు ప్రకారం హనుమాన్ వయసు ఏంటో తెలుసా.. కేవలం 53 సంవత్సరాలేనంట. విచిత్రంగా ఉంది కదూ.