ఒకే కంపెనీకి రెండు చావు దెబ్బలు..రెండూ మోడీ పంచ్ లే..!

Tuesday, February 21st, 2017, 02:08:21 PM IST


ఆహార ఉత్పత్తుల దిగ్గజం నెస్లే ఇండియా రూ 100 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. దీనికి రెండు కారణాలుగా ఆ సంస్థ చెబుతోంది. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం తమ ఉత్పత్తుల సేల్స్ పై భారీగా ప్రభావం చూపిందని అంటున్నారు. మరో వైపు మ్యాగీ న్యూడిల్స్ ఎఫెక్ట్ కూడా తమపై బాగా పడిందని కంపెనీ వాపోతోంది. ఈ రెండు కేంద్రప్రభుత్వ నిర్ణయాలే కావడం విశేషం.

గత మూడు నెలల వ్యవధిలో తాము రూ 100 కోట్లు నష్టపోయామని నెస్లే ఇండియా చైర్మన్ సురేష్ నారాయణన్ తెలిపారు. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం నుంచి కంపెనీ కోలుకోవాలంటే మరో ఆరు నెలలు సమయం పడుతుందని సురేష్ నారాయణన్ తెలిపారు. కాగా ఈ సంస్థ తయారు చేస్తున్న మ్యాగీ న్యూడిల్స్ లో సరైన నిభందనలు పాటించడం లేదని పెద్ద రగడ జరిగిన విషయం తెలిసిందే.మ్యాగీ ప్రభావం నుంచి కోలుకుంటున్నామన్న తరుణం లో కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.