ప్రేమించిన యువతి పెళ్లి చెడగొట్టాడు.. చివరికి ఆత్మహత్య!

Monday, September 3rd, 2018, 11:47:46 AM IST

ప్రేమించిన యువతి పెళ్లి చెడగొట్టాను అనే బాధతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. లేఖ రాసి తన చివరిమాటలతో తప్పు ఒప్పుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖసిటిలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. అసలు వివరాలొక్కి వెళితే దిబ్బపాలేనికి చెందిన రమేష్ (28) అనే యువకుడు ఐటిఐ చేశాడు. అనంతరం పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనగిస్తున్నాడు. అయితే రమేష్ ఒక యువతీని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు.

ప్రేమించిన అమ్మాయికి రఘు అనే వ్యక్తితో ఇటీవల వివాహం నిశ్చయమయ్యింది. సెప్టెంబర్ 2న వివాహం జరగాల్సి ఉండగా రమేష్ రఘు వద్దకు వెళ్లి నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తోంది అన్నట్లు చెప్పాడు. దీంతో రఘు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు రమేష్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. పోలీసులు శనివారం రమేష్ ను విచారించి పుచికుత్తుతో ఇంటికి పంపించేశారు. అనంతరం యువతికి పెళ్లి చెడగొట్టాను అనే మనస్తాపంతో రమేష్ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక అతను జేబులో దొరికిన సూసైడ్ నోట్ లో యువతి చాలా మంచిదని ఆమెను దక్కించుకోవాలనే తప్పుడు ఆలోచనతో నిందలు వేశానని తనది వన్ సైడ్ లవ్ అని పేర్కొంటూ.. రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని రమేష్ కోరాడు.

  •  
  •  
  •  
  •  

Comments