బీజేపీ మహిళా నేతకు లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు

Sunday, September 18th, 2016, 11:36:07 AM IST

vanathi
ఈ మధ్య కుర్రాళ్ళు చాలా స్పీడుగా ఉన్నారు. ఎదుటివారు ఎవరైనా, ఎంతటివారైనా సరే మనసులో ఉన్న మాటను భయపడకుండా చెప్పేస్తున్నారు. నిన్న మోదీ పుట్టినరోజు సందర్బంగా కోవైలో బీజేపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధిగా తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి, మహిళా నేత వానతీ శ్రీనివాసన్ ను ఆహ్వానించారు.

వేడుకలన్నీ ముగిశాక వానతీ శ్రీనివాసన్ కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సందర్భంలో తంజావూరుకు చెందిన ముత్తువేల్ అనే యువకుడు వాంటె శ్రీనివాసన్ వద్దకు వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఐలవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో వానతీ అవాక్కయ్యారు. చుట్టూ ఉన్న నేతలు కూడా ఆ యువకుడు చేసిన సాహసానికి ఖంగుతిన్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆ యుకుడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.