మూవీ రివ్యూ : లవర్స్ డే

Thursday, February 14th, 2019, 02:58:53 PM IST

వింకింగ్ సెన్సేషన్ అయినటువంటి ప్రియా ప్రకాష్ వారియర్ మరియు నూరిన్ షెరీఫ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఒరు అదార్ లవ్” సినిమాని తెలుగులో “లవర్స్ డే” పేరిట ఈ లవర్స్ డే కి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.మలయాళం లో మంచి హిట్ గా నిలిచిన సినిమా మన దగ్గర ఎంతవరకు విజయాన్ని సాధించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే రోషన్ అబ్దుల్ రాహూఫ్(రోషన్) ప్రియా ప్రకాష్ వారియర్(ప్రియా)లు ఒకే స్కూల్లో చదువుతుంటారు.వీరిద్దరూ ఒకరినొకరు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు.కానీ కొన్ని ఊహించని పరిణామాల వల్ల వీరిద్దరూ విడిపోతారు,దానితో రోషన్ తన మరో స్నేహితురాలు అయినటువంటి నూరిన్ షెరఫ్(గథా) సహాయంతో ప్రియకు దగ్గరవ్వాలనుకుంటాడు,ఆ సమయంలో రోషన్ తిరిగి మళ్ళీ తన ప్రేమను దక్కించుకున్నాడా?ఆ క్రమంలో నూరిన్ కు రోషన్ కు ఎలాంటి సంబంధం ఏర్పడింది.క్లైమాక్స్ లో ఎవరు ఎవరి ప్రేమను గెలుచుకున్నారు అన్నది తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఎవరు ఏమనుకున్నా సరే ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి మాత్రం ప్రధాన కారణం ప్రియా ప్రకాష వారియర్ అనే చెప్పాలి.చిన్న టీజర్ తోనే సెన్సేషన్ సృష్టించిన ఈమె సినిమాలో కూడా మంచి నటననే కనబర్చింది.అలాగే ఈమెకి జోడిగా నటించిన రోషన్ అబ్దుల్ రహూప్ కూడా అద్భుత నటనను కనబర్చారు.టీజర్ లో మాత్రమే కాకుండా సినిమా లో కూడా ఈ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.యుక్త వయసులోనే ప్రేమలో పడ్డ యువ జంటగా ఈ ఇద్దరు కరెక్ట్ గా సెట్టయ్యారు.
అలాగే లిప్ లాక్ సీన్ మరియు క్లాస్ రూమ్ లో కన్ను కొట్టే సీన్లు ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ గా నిలుస్తాయి.అలాగే అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా బాగానే నడుస్తుంది.అలాగే ఈ సినిమాకి సంగీతం అందించిన షాన్ రహమాన్ అందించిన అన్ని పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించిన నూరిన్ షెరీఫ్ కూడా మంచి నటనను కనబర్చారు.

ఇక దర్శకుని పనితనంకి వచ్చినట్టయితే ఒమర్ లులూ టీనేజ్ వయసు ఉన్నటువంటి యువతీ యువకుల మధ్య వారు స్కూల్ టైం లో ఉండే లవ్ స్టోరీస్ అనే సింపుల్ కథనాన్నే ఎంచుకున్నారు.ఇది అందరికీ తెలిసిన ట్రాకే కాబట్టి మరీ ఎక్కువ కొత్తదనం ఏమన్నా చూపిస్తారా అనుకుంటే లులూ దాన్ని అందించలేకపోయారనే చెప్పాలి.కాకపోతే ప్రధాన పాత్రధారుల మధ్య వచ్చే కెమిస్ట్రీ ఎపిసోడ్స్ అలాగే బ్రేకప్ సీన్స్ వంటివి మాత్రం మంచి ఆసక్తికరంగా తెరకెక్కించారు,కానీ ఆయన చెప్పాలనుకున్నది స్నేహానికి మరియు ప్రేమకు ఉన్న అసలు వ్యత్యాసాన్ని తెరెకెక్కించడంలో విఫలమయ్యారనే చెప్పాలి.అలాగే కొన్ని అనవసరమైన సీన్లు,సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎంగేజింగ్ సీన్లు పేలవమైన క్లైమాక్స్,వంటివి సినిమా చూసే ప్రేక్షకులకి సినిమా పై ఉన్న ఆసక్తిని తగ్గించేస్తాయి.వీటన్నిటి పైనా దర్శకుడు ఒమర్ లులూ ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

ప్రియా మరియు రోషన్ ల మధ్య కెమిస్ట్రీ
ఫస్టాఫ్ లో వచ్చే ఆ వింకింగ్ సీన్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సాగదీతగా సాగే సెకండాఫ్
కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
కథనం

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే చిన్న టీజర్ తో సెన్సేషన్ సృష్టించిన ప్రియా ప్రకాష్ వారియర్ మరియు రోషన్ ల కాంబినేషన్ వెండి తెరపై తేలిపోయిందనే చెప్పాలి.యూత్ ఫుల్ కంటెంట్ తీసుకున్న ఒమర్ లులూ తన సినిమాకి పూర్తి న్యాయం చేకూర్చారా అంటే లేదనే చెప్పాలి,అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్ప మిగతా సినిమా అంతా రొటీన్ గానే సాగుతుంది,ఈ లవర్స్ డే నాడు వచ్చిన ఈ “లవర్స్ డే” చిత్రాన్ని ఒక్కసారి అయితే చూడొచ్చు.

Rating : 2/5

4 & Above – Must Watch
3.5 – Hit
3 – Average
2.5 – Below Average
2 & Below – Stay Away

REVIEW OVERVIEW
Lover's Day Telugu Movie Review