ల‌వ‌ర్స్ డే ట్విట్ట‌ర్ టాక్ : ల‌వర్స్ లాక్ అయినట్టేనా..?

Thursday, February 14th, 2019, 07:45:18 AM IST

దేశ‌వ్యాప్తంగా సెన్షేష‌న్ క్రియేట్ చేసిన‌ కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ న‌టించిన ల‌వ‌ర్స్ డే మూవీ ప్రేమికులరోజు కానుక‌గా ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌న్ను కొట్టి రాత్రిక రాత్రే దేశ‌వ్యాప్తంగా సెన్షేషన్ అయిన ప్రియా వారియ‌ర్ ఈ చిత్రంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మ‌ల‌యాళంలో ఓరు ఆదార్ ల‌వ్ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రం.. ప్రియా వారియ‌ర్ తీసుకొచ్చిన హైప్‌తో తెలుగు, త‌మిళంలో కూడా డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ విడుద‌ల అవుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజర్, ట్రైల‌ర్‌లు, సాంగ్స్ కుర్ర‌కారును విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక విడుద‌ల‌కు ముంది విడుద‌ల చేసిన రొమాంటిక్ టీజ‌ర్‌లో అయితే ప్రియా ఏకంగా లిప్‌కిస్‌తో కుర్రాళ్ళ మ‌తి పోగొట్టింది.

ఈ నేప‌ధ్యంలో కాలేజ్ బ్యాచ్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందో అని ఎదురు చూస్తున్నారు. ప్రియా, రోష‌న్‌ల‌తో పాటు ప‌లువురు న‌టించిన ఈ చిత్రానికి ఒమర్ లులు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ చిత్రాన్ని తెలుగులో ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.

అయితే తెలుగులో ల‌వ‌ర్స్ డే ప్ర‌మోష‌న్స్ లైట్ తీసుకున్నారు చిత్ర యూనిట్. మొద‌ట్లో అల్లు అర్జున్‌ని సైతం వాడుకుని ఆడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమా విడుద‌ల‌కు ముందు తెలుగు, ఇత‌ర బాష‌ల్లో ప్ర‌మోష‌న్స్ చాలా లైట్ తీసుకున్నారు. దీంతో ఈ సినిమా మ‌ల‌యాళం విష‌యం ప‌క్క‌న పెడితే తెలుగులో మాత్రం ల‌వ‌ర్స్ డే చ‌ప్పుడు లేకుండా విడుద‌ల అవుతోంది. ఇక ప్రీమియ‌ర్స్ 8 గంట‌ల‌కి మొద‌లు కానుండ‌డంతో, ట్విట్ట‌ర్‌లో మాత్రం హంగామా స్టార్ట్ అయ్యింది.