అందుకే కెప్టెన్సీ వదులుకున్నా.. మహేంద్ర సింగ్ ధోని..!

Thursday, September 13th, 2018, 06:25:21 PM IST

మిస్టర్ కూల్ గా పిలవబడే ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా సరే ఏ నాడు గర్వ పడలేదు,ఎంత కష్ట కాలం లో అయినా సరే తన ఒత్తిడిని అంతా పంటి కిందే బిగబట్టి భారత జట్టుకి ఎన్నో విజయాలను అందించాడు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా చాలా సాధారణంగానే టెస్టుల నుంచి తన విరమణను తీసుకున్నాడు. అదే కొన్ని రోజుల తర్వాత అభిమానులకు ఇంకో షాక్ ఇచ్చాడు, భారత జట్టు యొక్క నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తాను తప్పుకుంటున్నాను అని తెలిపాడు.అయితే ఈ రోజు తాను భారత జట్టు టెస్ట్ మరియు వన్డే మ్యాచులకు ఎందుకు దూరం అయ్యారో చెప్పారు.

జార్ఖండ్, రాంచీలో సీఐఎస్ఎఫ్ వారు నిర్వహించిన ఒక ప్రెస్ మీటింగులో తాను ఎందుకని జట్టు నాయకత్వ భాద్యతలు విడిచిపెట్టారో తెలిపారు.”2019 ఐసీసీ నిర్వహించబోయే వరల్డ్ కప్ మ్యాచులను దృష్టిలో పెట్టుకొని, జట్టు సారథికి తన టీం ని అన్ని విధాలా సంసిద్ధం చేసుకోడానికి కొంత సమయం కావాలి అని,ఒకవేళ కొంచెం ఆలస్యంగా కొత్త జట్టు సారధి వచ్చినట్టైతే వారికి జట్టుని అన్ని విధాలా సంసిద్ధం చేసుకోడానికి తగినంత సమయం ఉండదు అని అందుకే ముందుగా ఆలోచించే కెప్టెన్ భాద్యత నుంచి తప్పుకున్నాను” అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments