`మా` గొడ‌వ‌.. అంతా గంద‌ర‌గోళ‌మే!?

Wednesday, September 5th, 2018, 02:20:06 AM IST

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో అవినీతి జ‌రిగిందా .. లేదా? మా అధ్య‌క్షుడు శివాజీరాజాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజాలెన్ని? న‌రేష్ ఆరోప‌ణ‌ల‌పై ఎవ‌రికి ఎంత స్ప‌ష్ట‌త ఉంది? ఇంత‌కీ ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ వేస్తున్నారా.. లేక అంత‌ర్గ‌తంగానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోనున్నారా?.. ఇది కేవ‌లం కొంద‌రి వ్య‌క్తిగ‌త ప్రాప‌కానికి సంబంధించిన గొడ‌వా? సంఘంలో అస‌లేం జ‌రుగుతోంది? ఒక‌రిక‌పై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకోవ‌డం ద్వారా మా ప‌రువు మ‌ర్యాద‌ల్ని మంట‌గ‌లప‌డ‌మే వీళ్ల ల‌క్ష్య‌మా? ప‌్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టులు స‌హా టాలీవుడ్ వ‌ర్గాల్లో సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. అధ్య‌క్షుడు శివాజీరాజా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేష్ దీనికి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. అలానే నేరారోప‌ణ‌లు చేసి వ‌దిలేస్తే చాల‌దు. వాటిని నిరూపించాల్సిన బాధ్య‌త ఇప్పుడు న‌రేష్‌పై ఉంది. క‌మిటీలు వేస్తారా? లేక ఇంకేదైనానా.. ఏం చేసినా మీడియాకెక్కి ర‌చ్చ చేశారు కాబ‌ట్టి దీనిపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

మ‌రోవైపు మూవీ ఆర్టిస్టుల సంఘం వ్య‌వ‌హారంపై తామ‌ర‌తంప‌ర‌గా ర‌క‌ర‌కాల త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం అయిపోతున్నాయి. ఇరు వ‌ర్గాల్లో ఎవ‌రు ఏమిటి? ఏది నిజ‌మో తెలియ‌ని గంద‌ర‌గోళంలో కొన్ని యూట్యూబ్ చానెళ్లు ఇష్టానుసారం ప్ర‌చారం చేస్తున్నాయి. ఒక్కో కులానికి ఒక్కో చాన‌ల్ అన్న చందంగా కులాభీష్టం మేర‌కు ప్ర‌చారం సాగిపోవ‌డం చూస్తుంటే అస‌లు వాస్త‌వం మ‌రుగున ప‌డిపోయి అస‌త్య ప్ర‌చార‌మే ఎక్కువ‌గా బ‌య‌ట జ‌రుగుతోంది. ఈ వివాదం విష‌యంలో ఐదు విష‌యాలు గ్ర‌హించాల్సి ఉంది. అస‌లు నిధుల గోల్‌మాల్ ప్రూఫ్ ఏది? వాది-ప్ర‌తివాది ఒకే వేదిక‌పైకి రారా? ఇందులో ఈవెంట్ మ్యానేజ‌ర్ల పాత్ర ఎమిటి? అన్న‌ది తేలాల్సి ఉందింకా. స‌మ‌స్య‌కు సినీపెద్ద‌లు ఏ త‌ర‌హా సొల్యూష‌న్ ఇస్తారో కాస్త ఓపిగ్గా వేచి చూడాలి. ప్ర‌స్తుత గంద‌ర‌గోళం విష‌యంలో చానెళ్లు సైతం కాస్తంత సంయ‌మ‌నం పాటించి నిజాల్ని మాత్ర‌మే ప్ర‌చారం చేస్తే బావుంటుంద‌ని కోరుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments