నిరూపిస్తారా? బ‌స్తీ మే స‌వాల్‌- శివాజీరాజా

Monday, September 3rd, 2018, 02:50:00 PM IST

ప్ర‌తిష్ఠాత్మ‌క మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) వివాదం అంత‌కంత‌కు ర‌చ్చ‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మా అధ్య‌క్షుడు శివాజీ రాజా నిధులు కైంక‌ర్యం చేయ‌డంతో ప‌ద‌వికి ఊస్టింగ్ ఇచ్చేశార‌ని నిన్న‌టిరోజున ప్ర‌ఖ్యాత ఆంగ్ల ప‌త్రిక‌లో క‌థ‌నం వెలువ‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. మా సిల్వ‌ర్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్ అమెరికా ఈవెంట్‌తో వ‌సూలైన నిధి దుర్వినియోగ‌మైంద‌ని క‌థ‌నం వెలువ‌డింది.

ఈ ఆరోప‌ణ‌ల‌పై మా అధ్య‌క్షుడు శివాజీ రాజా స్పందించారు. ఒక‌వేళ ఆరోప‌ణ‌ల్ని నిరూపిస్తే గుండు గీయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని స‌వాల్ చేశారు. మ‌రో నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉండ‌డం వ‌ల్ల ఇప్ప‌టినుంచే త‌న‌పై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం సాగుతోంద‌ని మీడియా ముఖంగా వాపోయారు. నేడు ఫిలింఛాంబ‌ర్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఆరోప‌ణ‌ల్ని ఖండించారు. అమెరికాలో మెగా ఈవెంట్ వ‌ల్ల కోటి మాత్ర‌మే వ‌సూలైందా? మెగాస్టార్ స్టామినా అంతేనా? అంటూ మీడియా సంధించిన ప్ర‌శ్న‌కు శివాజీ రాజా స‌మాధాన‌మిచ్చారు. ఆ ఈవెంట్ నుంచి కోటి సేక‌రించ‌డం మాత్ర‌మే మా ల‌క్ష్యం. అంత‌కుమించి ఏం వ‌చ్చినా మాకు సంబంధం లేదు అని తెలిపారు. మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి కోస‌మే అమెరికా ఈవెంట్ నిర్వ‌హించామ‌ని, ఇలాంటి ఈవెంట్ వేరొక ఇండ‌స్ట్రీ ఇంత‌వ‌ర‌కూ నిర్వ‌హించ‌లేద‌ని తెలిపారు. మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మాణం ఈ ఏడాది చేప‌డ‌తామ‌ని అన్నారు స‌మావేశంలో ఉపాధ్య‌క్షుడు శ్రీ‌కాంత్‌, ట్రెజ‌ర‌ర్‌ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments