మాటీవీ “పవిత్రబంధం” సీరియల్ నటి ఆత్మహత్య ..!

Wednesday, February 6th, 2019, 09:07:49 AM IST

ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలకలం రేపుతోంది, ఝాన్సీ మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్ పవిత్రబంధం లో నటిస్తోంది. ఇప్పటికే పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య వార్త అందరిని షాక్ కి గురి చేసింది, ఆమె తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణమా లేక ఏ ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

శ్రీనగర్‌ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అన్న సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది, ఆమె తల్లి దండ్రులు ప్రేమ నిరాకరించినందుకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.