మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్..మురిసిపోయిన చంద్రబాబు..!

Saturday, January 20th, 2018, 02:50:48 AM IST

ఆంధ్రప్రదేశ్ లో తయారైన మొట్ట మొదట డ్రోన్ ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు మురిసిపోయారు. అమరావతి డ్రోన్ ల కంపెనీ తయారు చేసిన డ్రోన్ ని చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలెక్టర్ ల సదస్సులో ఆవిష్కరించారు. ఏపీలో తయారైన తొలి డ్రోన్ ఇదే. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక విశాఖలో తొలి డ్రోన్ తయారీ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ ప్రస్తుతం ఉత్పత్తిని మొదలుపెట్టింది.

చంద్రబాబు, నారా లోకేష్ కలసి డ్రోన్ ని ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబుకు లోకేష్ డ్రోన్ విశేషాల్ని తెలియజేసారు. మార్కెట్ లో వస్తున్న డ్రోన్ లకంటే ఇవి ఎక్కువ నాణ్యవంతమైనవని లోకేష్ వివరించారు. మిగిలినవాటి కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు తెలియజేశారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ మరియు ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యంతో అమరావతి డ్రోన్ కంపెనీ నెలకొల్ప బడింది.