మ‌ధుర‌వాణి మోడ్ర‌న్‌ జ‌ర్న‌లిస్ట్‌!

Tuesday, May 29th, 2018, 01:42:30 PM IST

జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిని .. అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. లెజెండ్ సావిత్రి జీవిత‌క‌థ‌ను ప‌రిశోధించే పాత‌కాలం జ‌ర్న‌లిస్టుగా స‌మంత అభిన‌యం అద్భుతం. మ‌హాన‌టి విజ‌యంలో కీర్తి సురేష్ పాత్ర ఎంతో, స‌మంత పాత్ర అంతేన‌న్న పేరు వ‌చ్చింది. ఆ కాలంలో అమాయక జ‌ర్న‌లిస్టు ఎలా ఉండేవారో, ఆ పాత్ర‌లో ఎలివేట్ చేశారు. మ‌హాన‌టి ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌రో సినిమాలోనూ సామ్ జ‌ర్న‌లిస్టుగా న‌టించ‌డం ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ అయ్యింది.

స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తూ.. నిర్మిస్తున్న `యుట‌ర్న్‌` ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉంది. ఈ సినిమాలోనూ స‌మంత జ‌ర్న‌లిస్టుగా న‌టిస్తోంది. అయితే మ‌ధుర‌వాణితో పోలిస్తే, ఈ జ‌ర్న‌లిస్టు సంథింగ్ స్పెష‌ల్. అక్క‌డ పాత కాలం జ‌ర్న‌లిస్టు అయితే, ఇక్క‌డ అధునాత‌న జ‌ర్న‌లిస్ట్‌. ఇటీవ‌లే టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక ఆఫీస్‌లో స‌మంత‌పై కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. పొట్టి హెయిర్‌.. ముక్కు పుడ‌క‌తో అల్ట్రా మోడ్ర‌న్ జ‌ర్న‌లిస్టుగా ఈ ఫోటోల్లో క‌నిపించింది. మ‌ధుర‌వాణి ఇలా మోడ్ర‌న్ జ‌ర్న‌లిస్టుగా క‌నిపిస్తుంటే కుర్ర‌కారులో ఒక‌టే క‌ల‌క‌లం చెల‌రేగింది.

  •  
  •  
  •  
  •  

Comments