ముఖ్యమంత్రి చేసిన మిస్టేక్.. ఎన్నికలకు ఎఫెక్ట్ ?

Saturday, January 20th, 2018, 11:56:23 AM IST

ఎన్నికలు రాబోతున్నాయంటే చాలు రాజకీయ నేతల్లో తెలియని అలజడి మొదలవుతుంది. ఎలాగైనా కష్టపడి జనాలను ఆకర్షించాలని ప్రచారాలకు వెళతారు. అంతే కాకుండా జనాలతో కలుస్తూ స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అవసరం అయితే వారి ఇళ్లకు వెళ్లి భోజనం కూడా చేస్తారు. ఇక వారు ఎదురుగా వచ్చినపుడు ఎంతో ఆప్యాయంగా పలకరించాడానికి వెళతారు. కానీ వారి వెంట ఉండే సెక్యూరిటీ సిబ్బంది భద్రతా ప్రమనాలనూ దృష్టిలో ఉంచుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తరుణంలో జనాలను తోసేస్తుంటారు.

అయితే జనాలు హాట్ అయితే ఓట్లు ఎక్కడపోతాయో అని నేతలు సెక్యూరిటీ ని కంట్రోల్ చేస్తారు. కానీ ఒక సీఎం మాత్రం ఏకంగా తన బాడీగార్డ్ పై చేయి చేసుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే..రీసెంట్ గా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో ఒక సెక్యూరిటి గార్డ్ పై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం ఇప్పుడు మధ్య ప్రదేశ్ లో సంచలనంగా మారింది. వెంటనే ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రతి పక్షాలు గోల చేస్తున్నాయి. ప్రాణాలను కాపాడే ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడం నేరంతో సమానం కాబట్టి అతన్నీ కోర్టుకెక్కించాలని ఆరోపణలు వెలువడుతున్నాయి. దీంతో ఆయనకు ఇప్పుడు ఆ సమస్య తలనొప్పిగా మారిందట. ఈ విషయం కోర్టు వరకు వెళితే ఎన్నికలకు ఎఫెక్ట్య్ పడుతుందని అక్కడ టాక్ బాగా వినిపిస్తోంది.