వారిపై అత్యాచారం చేస్తే ఇక ఉరిశిక్ష తప్పదు

Tuesday, December 5th, 2017, 10:00:45 AM IST

మహిళల క్షేమం కోసం పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో బాలికల పై ఎక్కువగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్ గా కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వెళుతోన్న ఒక బాలికపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ తరహా దాడులకు ఎలాగైనా ముగింపు పలకాలని మద్య ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి ఎవరైనా పన్నెండేళ్ల వయసు లోపు ఉన్న బాలికలపై అత్యాచారానికి ప్రయత్నిస్తే.. వారికి ఉరిశిక్ష విధించాలని అలాగే దాడులు జరిగితే కఠిన శిక్షలని విధించాలని రాష్ట్ర మంత్రి మండ‌లి కొత్త చ‌ట్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే మధ్య ప్రదేశ్ అసెంబ్లీ లో బిల్లు ఆమోదం పొందింది. అందరు నాయకులు ఈ విషయం పై వారి మద్దతును తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్ మాట్లాడుతూ.. ఇక ఎవరైనా ఆడపిల్ల పై ఎటువంటి దాడులు చేసినా శిక్షలు కఠినంగా ఉంటాయి. వారు ఎంతటివారైనా ప్రభుత్వం నుండి తప్పించుకోలేరని అసెంబ్లీలో మాట్లాడారు. అయితే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments