సమాధి నుంచి ‘అమ్మ’ డెడ్ బాడీ మళ్లీ బయటకు..?

Thursday, December 29th, 2016, 09:12:29 PM IST

jayalalitha
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం చుట్టూ అలుముకున్న అనుమానాలు తీవ్ర పరిణామాల దిశగా అడుగులు వేస్తున్నాయి.అమ్మ మరణం పై హైకోర్టు కోర్టు సైతం అనుమానాలను వ్యక్తం చేసింది.తమిళనాడు అరుంబాక్కం కు చెందిన అమ్మ మరణం పై హైకోర్టు లో పిటిషన్ వేసాడు. దీనిని హై కోర్ట్ విచారణకు స్వీకరించింది. జయ అనారోగ్యం కారణం గా సెప్టెంబర్ 22 న అపోలో ఆసుపత్రి లో చేరినప్పటినుంచి అమ్మ కు జరిగిన చికిత్సావిధానాన్ని, చోటుచేసుకున్న పరిణామాలను బహిర్గతం చేయాలని అతడు కోర్టుని కోరాడు.

దీనితో ఈ పిటిషన్ ని హై కోర్ట్ విచారణకు స్వీకరించింది. జయ మరణం పై సమగ్ర విచారణ జరిపి నివేదికని జనవరి 9 లోగా అందించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.అసలు జయ మృతి పై గోపత్య పాటించాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రభుత్వం తరుపున న్యాయవాదిని ప్రశ్నించింది. జయ మరణం లో గోప్యత లేదని న్యాయవాది ఇచ్చిన సమాధానానికి కొట్రు సంతృప్తి చెందలేదు. జయమరణం పై మీడియాకు కూడా ఉన్న అనుమానాలను హై కోర్ట్ గుర్తుచేసింది. జయ మృత దేహాన్ని మళ్ళీ ఎందుకు పరీక్షించకూడదని న్యామూర్తి అన్నారు. ఆదిశగా ఆదేశాలు ఎందుకు జారీ చేయకూడదని అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని న్యాయమూర్తి అన్నారు. చికిత్స జరిగిన విధానం కేంద్రానికి తెలుసు అని అయినా కూడా మౌనంగా ఉందని న్యాయమూర్తి మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments