సంతానం కోసం ఖైదీకి సెలవులు ఇచ్చిన కోర్టు

Thursday, January 25th, 2018, 06:00:11 PM IST

ఈ మధ్య కాలంలో న్యాయస్థానాలు ఇస్తోన్న తీర్పులు కొన్ని చాలా వరకు ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి. అంతే కాకుండా చట్టంలో ఉన్న పరిధులను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తులు తీర్పును ఇస్తున్నారు. రీసెంట్ గా మద్రాస్ హై కోర్టు కూడా అదే తరహాలో తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబందించిన న్యూస్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు లేని విధంగా ఒక ఖైదీకి సంతానం పొందేందుకు కోర్టు అనుమతినియు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. గత 18 ఏళ్లుగా జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఒక వ్యక్తి భార్య తన భర్త నుంచి సంతానం కోరుకుంటున్నట్లుగా కోర్టును కోరింది.

అయితే 32 ఏళ్ల ఆ మహిళ అడిగిన దాంట్లో న్యాయం ఉందని కోర్టు ఖైదీకి రెండు వారాల వరకు అనుమతి ఇచ్చింది. అవసరం అయితే మరో రెండు వారలు కూడా సెలవులను పొడిగిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. అలాగే సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ సదరు ఖైదీకి ఎస్కార్టుగా ఉండవచ్చని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై అభ్యంతరం తెలిపినప్పటికీ ఇప్పటివరకు వారికీ పిల్లలు లేకపోవడంతో సెలవులను ఇవ్వడంలో తప్పులేదని స్పష్టం చేస్తూ.. చాలా దేశాల్లో ఇలాంటి నియమాలు ఉన్నాయని వివరించారు. అంతే కాకుండా ఒకరు జైళ్లల్లో ఉంటె మరొకరు జైలుకి వచ్చి లైంగికంగా పాల్గొనే హక్కు ఉంది. అందుకు ఏర్పాట్లు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.