దిన‌క‌ర‌న్ అండ్ టీమ్‌కు బ్రేకింగ్ షాక్.. ప‌ళ‌నిస్వామి సేఫ్..!

Thursday, October 25th, 2018, 12:18:03 PM IST

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు టీటీవీ దిన‌క‌ర‌న్ అండ్ టీమ్‌కు షాక్ ఇచ్చింది. దిన‌క‌ర‌న్ వ‌ర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పై అన‌ర్హ‌త కేసు పై ఎలాంటి తీర్పు వ‌స్తుందో అని వెయిట్ చేసిన వారికి మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప‌ళ‌నిస్వామి విశ్వాస‌ప‌రీక్ష గండం నుండి త‌ప్పించుకున్నారు. లేక‌పోతే ప‌ళ‌నిస్వామి త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేది.

ఇక ఈ 18 ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసు పై గ‌తంలో ఇద్ద‌రు న్యాయ‌మూర్త‌లు నుండి విభిన్న‌మైన తీర్పు వెలివ‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో మూడో జ‌డ్జికి ఈ కేసును అప్ప‌గించ‌గా.. దిన‌క‌ర‌న్ వ‌ర్గానికి చెందిన 18 ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకున్న స్పీక‌ర్ నిర్ణయాన్ని మ‌ద్రాసు హైకోర్టు స‌మ‌ర్ధించింది. దీంతో త‌న‌కు అన‌కూలంగా తీర్పు వ‌స్తుంద‌ని ధీమాగా ఉన్న దిన‌క‌ర‌న్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. అయితే ఆ 18 స్థానాల్లో ఉపఎన్నిక‌లను ఆరు నెల‌ల్లో నిర్వ‌హించాల‌ని హైకోర్టు ఆదేశించింది.

  •  
  •  
  •  
  •  

Comments