రూ.2 వేల నోటుని స్కాన్ చేయండి..మీముందు మోడీ ప్రత్యక్షమవుతాడు ..!

Sunday, November 20th, 2016, 12:08:54 PM IST

modi
కేంద్రప్రభుత్వం రూ 2 వేల నోటుని విడుదల చేసినప్పటి నుంచి చాలా మంది దానితో రకరకాల ప్రయోగాలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో విచిత్ర విషయం ఈ నోటుకు సంభందించి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే.. 2 వేల నోటుని మొబైల్ తో స్కాన్ చేస్తే మీ ముందు మోడీ ప్రత్యక్షమవుతాడు. అదేంటని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వింతే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేదో మాయో మంత్రమో కాదు. మొబైల్ ద్వారా 2 వేల నోటుని స్కాన్ చేస్తే మీమొబైల్ లో నల్ల ధనం పై మోడీ చేసిన సందేశం ప్రత్యక్షమవుతుంది. ఇది ఓ యాప్ ద్వారా మాత్రమే సాధ్యం. ‘మోడీ కి నోట్’ ఇది ఓ ఆండ్రాయిడ్ యాప్. దీని ఆధారంగానే ఆ వీడియో ప్రత్యక్షమవుతుంది.

దీనిద్వారా మోడీ ప్రసంగాన్నే కాకుండా వేరే వీడియోలు వచ్చేలా కూడా చేయోచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ యాప్ డెవలప్ మెంట్ లో భాగంగా మోడీ వీడియో ని రెండువేల నోటు పై ఇంపోస్ చేశారు. మొన్నిమధ్య ఓ వ్యక్తి రెండువేల నోటుని నీళ్లలో తడిపినా మళ్లీ యాధస్థితికి చేరుకుంది. ఇదే దీని ప్రత్యేకత అని ఆవ్యాథి వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ సంస్థ ఈ యాప్ ని డెవలప్ చేసింది.