జ‌గ‌న్ మాస్ట‌ర్ మైండ్… వైసీపీలోకి మాగుంట‌.. డేట్ కూడా ఫిక్స్..?

Monday, November 12th, 2018, 11:15:54 PM IST

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తాజాగా ఓ వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి అధికార, ప్ర‌తిప‌క్షాలు. అయితే ఈ క్ర‌మంలో ఇరుపార్టీల్లోని అసంతృప్త నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం పార్ట‌ల‌ను వీడ‌డానికి వెనుకాడ‌డం లేదు. ముఖ్యంగా అధికార టీడీపీలో అసంతృప్తుల సంఖ్య బాగా పెరిగింది. వారిలో టీడీపీ ఎమ్మెల్సీ ముగుంట శ్రీనివాసులురెడ్డి ఒక‌రు.

2014 ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మాగుంట‌.. వైసీపీ అభ్య‌ర్ధి సుబ్బారెడ్డి చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే చంద్ర‌బాబు మాత్రం ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినా అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్ దెబ్బ‌కి డ‌మ్మీ అయిపోయారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లు మాగుంట‌ను లైట్ తీసుకొని క‌లుపుకొని పోక‌పోవ‌డంతో ఆయ మ‌న‌స్థాపానికి గురైన మాగుంట ఆ పార్టీలో ఇమ‌డ‌లేక పోతున్నారు. ఇక మ‌రోవైపు క్యాబినేట్‌లో మంత్రి ప‌ద‌వి, టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన మాగుంట‌.. ఆ తర్వాత తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు.

ఈ నేపథ్యంలో మాగుంట వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ అధినేత జగన్ త‌న మాస్ట‌ర్ మైండ్‌తో రాయ‌భారం పంప‌గా మాగుంట చ‌ర్చ‌లు జ‌రిపార‌ని త‌ను అడిగిన ఎంపీ టిక్కెట్ పై జ‌గ‌న్ ప‌క్కా హామీ ఇచ్చార‌నే.. దీంతో సంతృప్తి చెందిన మాగుంట వైసీపీలో చేరేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి మాగుంట వైసీపీలో చేరితే వైవీ సుబ్బారెడ్డి ప‌రిస్థితి ఏంట‌ని స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌వ‌చ్చు. అయితే జ‌గ‌న్ మాస్ట‌ర్ మైండ్ ఎలా ఉందంటే వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా దిగితే ఆయ‌న ఒక పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గానికే ప‌రిమితం అవుతారు.. దీంతో ఆయ‌న‌కు పార్టీలోని కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని స‌మాచారం.