జ‌న‌సేనానిపై `కులం` కుట్ర‌?

Monday, September 17th, 2018, 07:00:12 PM IST

జ‌న‌సేన పార్టీపైనా, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పైనా తొలినుంచి ఓ అగ్ర‌కులం దారుణ‌మైన కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో జ‌న‌సేన‌కు ఓ అవ‌కాశం ఇస్తే, అది త‌మ ప్రాబ‌ల్యానికి, రాజ్యాధికారానికి మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారుతుంద‌ని చాలా ముందు నుంచే జ‌న‌సేనకు ముకుతాడు వేసే వ్యూహాన్ని ప‌న్నార‌న్న స‌మాచారం ఉంది. ఆ క్ర‌మంలోనే ప‌లు టీవీ చానెళ్లు, తేదేపా అనుకూల మీడియాలో జ‌న‌సేన‌పై విష‌పూరితమైన క‌థనాల్ని ప్ర‌చురించాయి. ఇప్ప‌టికీ ప్ర‌చురిస్తూనే ఉన్నాయి. ఈ ఒర‌వ‌డిలోనే ఏబీఎన్, మ‌హాచానెల్‌లో ప‌ని చేసిన జ‌ర్న‌లిస్టు మూర్తి జ‌న‌సేనానిని టార్గెట్ చేస్తూ కులం కుంప‌టిని రాజేసే ప్ర‌య‌త్నం చేశాడు.

జన‌సేన పార్టీ కులపిచ్చితో కొట్టుకుపోతోంద‌ని, ప‌వ‌న్ కుల నాయ‌కుల నుంచి, పారిశ్రామిక వేత్త‌ల నుంచి పార్టీ ఫండ్ క‌లెక్ట్ చేస్తున్నార‌ని, ఇదిగో నా “స్టింగ్ ఆప‌రేష‌న్“ అంటూ ఓ క‌థ‌నాన్ని మ‌హా చానెల్‌లో ప్ర‌చురించాడు. అయితే ఆ క‌థ‌నాలు అహేతుక‌మైన‌వి కావ‌డంతో వెంట‌నే వాటిని యూట్యూబ్ నుంచి ప‌లు మీడియాల నుంచి తొల‌గించారు. అంతేకాదు మూర్తిని స‌ద‌రు చానెల్ ఉద్యోగం నుంచి తొల‌గించింది. చానెల్లో ఉద్యోగం పోగొట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన మూర్తి హీరోలా జ‌బ్బ‌లు చ‌రుచుకుంటూ చాలానే నాట‌కాలాడ‌డం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో, ప్ర‌జల్లో చ‌ర్చ‌కొచ్చింది. మూర్తి మాత్రం తానే చానెల్‌ను, అందులో సిబ్బందిని ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని ఓ యూట్యూబ్ చానెల్ ద్వారా చెప్పుకున్నాడు. అంతేకాదు.. చానెల్లో తాను వేసిన క‌థ‌నానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని ధీర‌త్వం ప్ర‌ద‌ర్శించాడు. తాను ఏ ఒక్క కులానికి చెందిన వాడిని కాన‌ని, అగ్ర‌కులాల‌కు చెందిన వాడిని అస‌లే కాద‌ని, త‌న‌కు జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు అంటే ఇష్ట‌మ‌ని, అయితే కులం కార్డ్ క‌నిపించ‌డం వ‌ల్ల‌నే స్టింగ్ ఆప‌రేష‌న్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే మూర్తి వ్య‌వ‌హారం తొలి నుంచి అత‌డు ప‌ని చేసిన చానెళ్ల‌లో వేసిన క‌థ‌నాల దృష్ట్యా అత‌డు చెప్పే ఏ ఒక్క మాట‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. అత‌డు కాపు వ్య‌తిరేకి. పైగా తేదేపా అనుకూల‌వాది. ప‌వ‌న్ ని ఎలా అయినా కులం కుట్ర‌లోకి లాగాల‌న్న ప్ర‌య‌త్నం చాలా కాలంగా చేస్తూనే ఉన్నాడు. ఈ నిజం తెలిసిన వారెవ‌రూ మూర్తి నాట‌కాల్ని న‌మ్మ‌లేదు. అత‌డి దారుణ మ‌న‌స్త‌త్వం గురించి తెలిసిన అత‌డి కొలీగ్స్ అంతా ఇదేదో పెద్ద కుట్ర‌కు సంబంధించిన నాట‌కం అంటూ అభివ‌ర్ణిస్తున్నారు. అంతేకాదు పవ‌న్‌ని ఎలాగైనా బ‌ద‌నాం చేసేందుకు, కులం పేరుతో కుట్ర‌లోకి లాగేందుకు అత‌డు ఓ అగ్ర‌కులం నుంచి సుఫారీ తీసుకున్నాడ‌న్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి మూర్తి జ‌న‌సేనానిపై విషం చిమ్మ‌డం వెన‌క పెద్ద ఎజెండానే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.