‘మహాభారతం’ గురించి ఇప్పుడు కూడా అదే మాట అంటారా..!!

Friday, November 3rd, 2017, 06:50:49 AM IST

అత్యంత ప్రాచీనమైన సంస్కృతి కలిగిన దేశం మన భారతం. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టె మహా గ్రంధమే మహా భారతం. మహా భరతం కట్టు కథ కాదు.. అక్షర సత్యం అని నిరూపితమయ్యేలా ఇప్పటి వరకు అనేక ఆధారాలు బయట పడ్డాయి. అవి కూడా నిజాలు కాదు అని తోసి పుచ్చే వాళ్ళు ఎలాగూ ఉంటారు..అది వేరే విషయం. కాగా మహాభారతానికి సంబంధించిన మరో బలమైన ఆధారం బయట పడింది. భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనలో మహాభారతంలో అత్యంత ఆసక్తికర ఘట్టం లక్క ఇల్లు, సొరంగ మార్గాల గురించి స్పష్టమైన ఆధారాలు బయట పడ్డాయి. ఉత్తరప్రదేశ్ లోని బర్నావాలో ఈ ఆధారాలు బయటపడ్డాయి.

ఇదే ప్రాతంలో మహాభారతంలో లక్క ఇంటిని నిర్మించారని, అగ్నిప్రమాదం నుంచి తప్పించుకు సొరంగ మార్గం ద్వారా బయటపడ్డారని చరిత్ర చెబుతోంది. పురావస్తు శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారతం గురించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉండడంతో డిసెంబర్ నుంచి తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. లక్క ఇల్లు నిర్మాణం జరిగినట్లు భావిస్తున్న ప్రాతం అసలు పేరు వర్ణవ్రత్. కాల క్రమంలో బర్నావాగా మారింది. గతంలో ఈ ప్రాంతానికి సమీపంలో గల చంద్రయాన్, సీనౌలి అనే ప్రాంతాలలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో భారీ అస్థి పంజరాలు, రత్నాలతో కూడిన కిరీటాలు, కుండలు బయట పడ్డాయి. తాజాగా లక్క ఇంటికి, సొరంగానికి సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో ఇవి కూడా మహాభాత కాలం నాటివే అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మహాభారతం కేవలం కట్టు కథలా భావించే వారు ఇప్పుడు కూడా అదే మాట అంటారా అని చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు.

Comments