సీట్ల లెక్క తేలింది.. కొట్టుకు చావ‌డమే!?

Friday, November 9th, 2018, 11:43:00 AM IST

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో జోడీ క‌ట్టిన మహాకూట‌మిలోని పార్టీల మ‌ధ్య గ‌త కొంత కాలంగా సీట్ల సిగ‌ప‌ట్లు జోరుగా సాగిన విష‌యం తెలిసిందే. కూట‌మికి పీట‌ముడిగా మారిన సీట్ల లెక్క దాదాపుగా ఖ‌రారైంది. దీని కోసం భారీ క‌స‌ర‌త్తునే చేసిన కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు సీట్ల స‌ర్దుబాటుకు ఓకే చెప్పేసింది. కూట‌మిలోని ప‌క్షాలైన టీడీపీకి 14, తెజ‌స‌కు 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి 1 కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో మిగ‌తా 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి దిగుతోంది.

అయితే తెజ‌స‌కు కేటియించిన 8 సీట్ల‌లో తాము కోరుకున్న‌వి మాత్ర‌మే ఇవ్వాల‌ని కొత్త ట్విస్ట్ ఇచ్చారు కోదండ‌రామ్‌. కాంగ్రెస్ అదిస్ఠానం తెజ‌స‌కు కేటియించిన స్థానాలివే. 1. జ‌న‌గామ (కోదండ‌రామ్‌), 2. మెద‌క్ (జ‌నార్థ‌న్‌రెడ్డి), 3. దుబ్బాక (రాజ్‌కుమార్‌), 4. సిద్ధ‌పేట (భ‌వాని), 5.మ‌ల్కాజ్‌గిరి (క‌పిల‌వాయి దిలీప్‌కుమార్‌), 6) మ‌హ‌బూబ్ న‌గ‌ర్ (రాజేంద‌ర్‌రెడ్డి)7. వ‌ర్థ‌న్న‌పేట (అభ్య‌ర్థిని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు), 8. మేడ్చ‌ల్ (మ‌రివ‌ర్థ‌న్‌రెడ్డి) ఈ స్థానాల్లో పోటీకి దిగుతున్నారు. వీటికి తోడు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క వ‌ర్గాన్ని తెజస కోర‌డంతో దీనిపై కొంత చ‌ర్చ‌జ‌రిగింద‌ని, చివ‌రికి ఆ స్థానాన్ని టీడీపీ నేత రేవూరి ప్ర‌కాష్‌రెడ్డికి కేటియించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా వుంటే తెజ‌స‌కు చెందిన వెదిరె యోగేశ్వ‌ర‌రెడ్డి త‌మ స్థానాలు మ‌రిన్ని పెంచాల్సిందేనంటూ గురువారం కాంగ్రెస్ వ‌ర్గాల‌ని కోర‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇక తెదెపా కోరిన సీట్లు కాంగ్రెస్ కేటాయించ‌లేదు. సీపీఐ ఆశించిన సీట్ల స‌ర్తుబాటు జ‌ర‌గ‌క‌పోవ‌డం, ముందు నిర్ణయించిన మూడు స్థానాల్నే సీపీఐకి కేటాయించ‌డంతో ఈ పార్టీల నుంచి టికెట్‌లు ఆశించిన ఆశావ‌హుల నుంచి విమ‌ర్శ‌ల‌తో పాటు కొత్త‌గా కుమ్ములాట‌లు మొద‌ల‌య్యే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments