మినీ కూటమిలుగా మారనున్న మహాకూటమి…

Thursday, November 8th, 2018, 06:46:33 PM IST

రోజు రోజు కి మన రాష్ట్ర రాజకీయాలలో తీవ్రమైన మార్పు కనిపిస్తుంది. జాతీయ పార్టీలు కలిసి ఒక్కటిగా ఏర్పడ్డ మహా కూటమి కాస్త, ఇప్పుడు విడిపోయి 2 మినీ కూటమిలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెరాస ఓటమే లక్ష్యంగా పొత్తుకు శ్రీకారం చుట్టిన జాతీయ పార్టీలు సీట్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నాయి. ఆ లెక్కలు ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడం లేదు. సిగ్గుని పక్కన పెట్టిన టీడీపీ, కాంగ్రెస్ వదిలేసిన సీట్లతో సరిపెట్టుకున్న కూడా సిపిఐ, జన సమితి మాత్రం అక్కడే గిరి గీసుకొని కూర్చున్నాయి. కాంగ్రెస్ కి ఈ రెండు పార్టీలు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసాయి. సీట్ల విషయం లో తేడా వస్తే మాత్రం మీటింగ్ పెట్టుకొని తమ దారి తాము చేసుకుంటామని తేల్చి చెప్పేసాయి. సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ తో పాటు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం భేటీ కావడమే దీనికి నిదర్శనం.

సీట్ల కేటాయింపులో తీవ్ర అసంతృప్తితో ఉన్న సిపిఐ, టీజేఎస్ లు మినీ కూటమిగా ఏర్పడటానికి ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఉద్యమ నేపథ్యం ఉన్న తమ పార్టీ ని కూడా సింగల్ డిజిట్ కి పరిమితం చేయాలని చూసే సరికి కోదండరాం కి దిక్కు తోచడం లేదు. ఆ మాత్రం దానికి పార్టీ పెట్టడం దేనికి. తెరాస లో కలిస్తే మేమె గౌరవంగా చేసుకునేవాళ్లం కదా అని తెరాస నుండి విమర్శలు రావడం తో కోదండరాం కి దిక్కుతోచకుండా ఉంది. దీనికి తోసి సిపిఐ నేతలు కోదండరాం కి ఇంకా ఎక్కిస్తున్నారు. దీనితో ఇరు పార్టీల నాయకులు ఒక్కటిగా మినీ కూటమి ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో మహాకూటమిలో కలిసి పోకుండా విడిగా జనాల్లోకి వెళ్తే గెలుస్తామా లేదా అన్న విషయం పై వీరికి అనుమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసమనే ముందుగా బెదిరింపులకు తేరా తీశారు. వీలైనంతవరకు బెదిరించి చివరకు టీడీపీ లాగ ఈ రెండు పార్టీలు కుడ కాంగ్రెస్ తో సర్దుకుపోతాయనే మాటలు కూడా వినబడుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పక్షపాత పెద్దన్న పాత్రలో మహా కూటమి కాస్త రెండు మినీ కూటములుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏమవుతుందో ఇక వేచి చూడాలి మరి.