మహానటిలో గొప్ప పాత్రలు ఇవే!

Saturday, May 5th, 2018, 08:55:49 PM IST

టాలీవుడ్ లో వస్తోన్న మొట్ట మొదటి బయోపిక్ మహానటి. సావిత్రి జీవితం తెరపై ఎలా ఉంటుందా అని ఆమె అభిమానులతో పాటు నేటితరం వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. అయితే సినిమాలో కొన్ని పాత్రలకు సంబందించిన వీడియోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దర్శకుడు క్రిష్ – శ్రీనివాస్ అవసరాల సీనియర్ టెక్నీషియన్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అలనాటి దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో ఇప్పటి దర్శకుడు క్రిష్‌ కనిపిస్తున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ను సావిత్రిని పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ గారి పాత్రలో నటుడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కనిపించనున్నాడు. అందుకు సంబందించిన వీడియోను నాని వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేశారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది.