రివ్యూ రాజా తీన్‌మార్ : మహానటి – బయోపిక్ అంటే ఇలా ఉండాలి

Wednesday, May 9th, 2018, 05:57:39 PM IST

తెరపై కనిపించిన వారు : కీర్తి సురేష్
కెప్టెన్ ఆఫ్ ‘మహానటి’ : నాగ్ అశ్విన్

మూల కథ :
విజయవాడలో ఓ పేద కుటుంబంలో పుట్టి మద్రాస్ చేరుకొని సామాన్యురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిస్సంకర సావిత్రి (కీర్తి సురేష్) తన నటనతో మహానటిగా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారు, నటుడు జెమినీ గణేశన్ (దుల్కర్ సల్మాన్) తో ఆమె జీవితం ఎలా ఉండేది, నమ్మిన వాళ్ళే మోసం చేస్తే మనసు చెదిరి మందుకు బానిసై జీవిత చరమాంకంలో ఆమె ఎలాంటి క్షోభను, కష్టల్ని అనుభవించారు అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :
→  మొదటి విజిల్ దర్శకుడు నాగ్ అశ్విన్ కు వేయాలి. సాధారణంగా ఒకరి జీవితాన్ని బయోపిక్ రూపంలో తీస్తే అది చాలా వరకు డాక్యుమెంటరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఆకట్టుకునే కథనంతో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఆసక్తికరమైన సన్నివేశాలతో మంచి సినిమా చూసిన భావన కలిగించారు.

→  రెండో విజిల్ ఖచ్చితంగా సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కే వేయాలి. ఎందుకంటే ఆమె ఈ తరం చూడని సావిత్రిని తెరపై ఆవిష్కరించింది. సావిత్రిగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి.

→  జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటన అద్భుతమైన నటనకు, సినిమాలోని సెట్ వర్క్, సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నిటికీ కలిపి మూడో విజిల్ వేయవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

→  సినిమా మొదటి అర్థం భాగం కొంత నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది.
→  నటిగా సావిత్రిగారి ఎదుగుదల ఎలా జరిగింది అని చెప్పడానికి ఇంకొన్ని సన్నివేశాలను చూపించి ఉంటే బాగుండేది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో పెద్దగా వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

సినిమా చూసిన ఇద్దరి స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : ‘మహానటి’.. కీర్తి సురేష్ ఏం చేసిందిరా.. !
మిస్టర్ బి : అద్భుతహా అనిపించింది.
మిస్టర్ ఎ : నిజంగా సావిత్రి ఇలానే ఉండేవారేమో అనిపించింది.
మిస్టర్ బి : నాగ్ అశ్విన్ దర్శకత్వం సూపర్ అసలు.
మిస్టర్ ఎ : అవును.. బయోపిక్ అంటే ఇలా ఉండాలి అనేలా తీశాడు.

  •  
  •  
  •  
  •  

Comments