ఆ జోక్ వల్ల 33మంది ప్రాణాలు కోల్పోయరట!

Tuesday, July 31st, 2018, 05:40:06 PM IST

మహారాష్ట్ర లో ఇటీవల 34 మంది ప్రయాణికులతో ఉన్న ఒక బస్సు 800 అడుగుల లోయలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 33 మంది అక్కడికక్కడే మృతి చెందగా ప్రకాష్ అనే వ్యక్తి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. విహారయాత్ర కోసమని వచ్చిన ఆ ఉద్యోగుల జీవితం ఒక్కసారిగా ముగిసిపోవడం అందరిని కలచివేసింది. క్రాష్‌ బ్యారియర్లు లేకపోవడం వలన ప్రమాద జరిగిందని పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక బస్సు కండిషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పారు. ఇకపోతే చావు నుంచి బయటపడిన ప్రకాష్ ఘటనకు గల కారణాన్ని వివరించాడు. ఒక ప్రయాణికుడు వేసిన జోక్ కి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

దీంతో బస్సు డ్రైవర్ కూడా ఒక్కసారిగా ఏం జరిగిందని వెనక్కి తీరిగి చూశాడు. అప్పుడే బస్సు ఊహించని విధంగా అదుపుతప్పి లోయవైపు మళ్లింది. నేను ప్రమాదాన్ని గమనించి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలను రక్షించుకున్న. చూస్తుండగానే బస్సు ఒక బండరాయికి బలంగా తాకింది. అప్పుడే సగం మంది ప్రాణాలు పోయి ఉండవచ్చు. ఆ తరువాత 15 అడుగుల లోతులో ఉన్న ఒక చెట్టును తాకి పూర్తిగా కిందపడిపోయింది. తోటి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే నా గుండె ఎంతో మనోవేదనకు గురైంది. కొమ్మసాయంతో రోడ్డుపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్న నేను ఒక వ్యక్తి దగ్గర ఫోన్ అడిగి జరిగిన విషయాన్ని మా తోటి ఉద్యోగులకు చెప్పాను అనంతరం పోలీసులకు కూడా వివరించినట్లు ప్రకాష్ వివరణ ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments