పెట్రోల్ ధరలకు బెదిరి గుర్రాన్ని కొన్నాడు

Friday, May 25th, 2018, 01:10:09 AM IST

ప్రస్తుతం పెట్రోలు ధరలు పెరగడం చూస్తుంటే సమ్మర్ లో ఉష్ణోగ్రతలు కూడా అంతా స్పీడ్ గా పెరగవేమో అనిపిస్తోంది. మొదటిలో ఎదో పది పైసలు పెంచుతున్నారు అనుకుంటే ఆ తరువాత గ్యాప్ లేకుండా రూపాయలు పెరగడం సాధారణ మధ్య తరగతి వాడికి భారంగా మారింది. ముంబై లో అయితే అత్యధికంగా 85.29 రూపాయలు ఉండడంతో అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ పాల వ్యాపారి పెట్రోలు ధరలకు బెదిరిపోయి తన వద్ద ఉన్న బైక్ ను అమ్మేసి ఒక గుర్రాన్ని కొనుక్కోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ముంబయికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో పాండురంగ్‌ అనే పాల వ్యాపారి ప్రతి రోజు ఏడూ కిలోమీటర్లు ప్రయాణించి పాలను పోస్తుంటాడు. అయితే అతను రోజు 200 రూపాయలు కేవలం పెట్రోల్ కే వెచ్చించాల్సి వస్తుందని బైక్ ను 22 వేలకు అమ్మేసి 25 వేలతో మంచి గుర్రాన్ని కొనుగోలు చేశాడు. వేగంగా పాలు పోసేందుకు బైక్ ను వాడితే పెట్రోల్ ధరలు తన కష్టార్జితాన్ని మింగేస్తున్నాయని అందుకే గుర్రాన్ని కొన్నట్లు పాండురంగ్ అనే వ్యక్తి చెప్పాడు.

ప్రస్తుతం అతను గుర్రానికి వారానికి గాను 50 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. ఇక తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇదే సరైన మార్గం అని ఇక నుంచి పెట్రోల్ రేట్లతో భయం లేదని బంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదని ఆ చిరు వ్యాపారి తన వివరణ ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments