మహర్షి రిస్క్ లో పడనుందా..?

Wednesday, November 21st, 2018, 09:10:08 PM IST


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం మహర్షి, ఇటీవల ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే, ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా సరైన హిట్ లేని దిల్ రాజు ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు, మహేష్ బాబు నటించిన భారత్ అనే నేను ఓవర్సేస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. 3.5 మిలియన్ల డాలర్లు వసువులు చేసి మహేష్ కెరీర్ లోనే మంచి వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే నాణేనికి మరో వైపు కథ ఇంకోలా ఉంది, ఈ సినిమాను కొన్న బయ్యర్లు పెద్దగా లాభ పడలేదట, ఇందుకు కారణం ఓవర్సేస్ లో బారి ధరలకు అమ్మటమే అంట.

ఇప్పుడు మహేష్ బాబు ‘మహర్షి’ విషయంలో కూడా ఇలానే జరగబోతుందట. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకి అమ్మాలని చూస్తోన్న నిర్మాతలు ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా తగ్గడం లేదని తెలుస్తోంది.అక్కడి బయ్యర్లు రూ.16 కోట్లు పెట్టి హక్కులు దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాతలు ఆ నెంబర్ ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో లాభాలు అందుకోవాలంటే సినిమా సాలిడ్ హిట్ అందుకోవాలి లేదంటే బయ్యర్లు నష్టాల్లో పడడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ అనే నేను సినిమాకు హిట్ టాక్ వస్తేనే అది బయ్యర్లకు అంతంత మాత్రం లాభాలు తెచ్చి పెట్టింది. ఇక మహర్షికి ఆశించినంత బిజినెస్ జరగాలి అంటే అది భారత్ అనే నేను కంటే పెద్ద హిట్ అవ్వాలన్నమాట. ఏదేమైనా మహర్షి సినిమా మహేష్ బాబు స్టామినాకు పెద్ద పరీక్ష అవబోతోంది అన్నమాట.