మరో సినిమా మొదలు పెట్టినా “మహర్షి” తగ్గడం లేదు.!

Saturday, June 1st, 2019, 10:00:44 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం “మహర్షి”. ఇంకొన్ని రోజుల్లో ఈ చిత్రం వెండితెరపై పది నెలనాళ్ళు అవుతుంది.ఈ లోపే మహేష్ కూడా కొత్త సినిమా మొదలు పెట్టేసారు. అనిల్ రావి పూడితో తీస్తున్న ఈ సినిమాకు “సరిలేరు నీకెవ్వరు” అనే టైటిల్ ని కూడా వారు ఖరారు చేసి వచ్చే సంక్రాంతికే విడుదల చేయబోతున్నామని తెలిపారు.అలాగే తన ప్రస్తుత సినిమా అయినటువంటి మహర్షి ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతూ స్టడీగా వసూళ్లను రాబడుతుంది.

ఈ చిత్రం విడుదల అయ్యినప్పటి నుంచి ఆ ఆతర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది.దీనితో బాక్సాఫీస్ దగ్గర మహర్షి సత్తా చాటుతుంది.ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు కూడా ఈ సినిమా 100 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా తెలియజేసారు.అలాగే ఈ చిత్రం నిజామాబాద్ జిల్లాలో అయితే బాహుబలి మొదటి భాగానికి వచ్చిన కోటి 12 లక్షల షేర్ ను బద్దలుకొట్టినట్టు కూడా తెలుస్తుంది.దీనితో మహేష్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ అద్భుతమైన పాత్ర పోషించారు.దేవిశ్రీ సంగీతాన్ని అందించారు.