“మహర్షి” టీజర్ కాస్త ముందుగానే రానుందా..?

Thursday, March 14th, 2019, 06:51:36 PM IST

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు “మహర్షి” సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.”భరత్ అనే నేను” సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ మూడు రకాల షేడ్స్ లో కనిపించనున్నారు.దానికి తోడు ఈ సినిమాతో మహేష్ మరోసారి ప్రయోగం చేస్తున్నారని తెలిసాక ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి.కానీ ఈ చిత్ర యూనిట్ నుంచి ఒక్క అప్డేట్ కూడా ఆశించదగిన స్థాయిలో ఇవ్వలేదు.దీనితో మహేష్ అభిమానులు ఈ విషయంలో కాస్త నిరాశలోనే ఉన్నారు.

అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీ పట్ల కూడా మహేష్ అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది,ఆ తర్వాత మళ్ళీ ఒక క్లారిటీ రావడంతో కుదుట పడ్డారు.ఇక అన్ని వచ్చాయి,ఈ సినిమా టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా టీజర్ కాస్త ముందుకు వచ్చిందని తెలుస్తుంది.ముందు అయితే ఈ టీజర్ వచ్చే నెల ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని వార్తలొచ్చాయి.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ కాస్త ముందుకు వచ్చేలా ఉందని తెలుస్తుంది.”మహర్షి” టీజర్ ఈ నెలలోనే హోలీ సందర్భంగా ఈ నెల 21 న వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 9న విడుదల కానుంది.