“మహర్షి” నుంచి షాకింగ్ న్యూస్..ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో.?

Sunday, February 10th, 2019, 02:59:29 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి.ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీ గానే ఉన్నాయి.మహేష్ మరో సరి ప్రయోగం చెయ్యబోతున్నారు అలాగే రైతులను ఉద్దేశించి మంచి సందేశం కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నారన్న టాక్ రాగానే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమా విడుదల వచ్చే ఏప్రిల్ నెలలోనే అని కూడా ఖరారు అయ్యిపోయింది.

కానీ ఇప్పుడు సినీ వర్గాల నుంచి వస్తున్న ఒక సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది.ప్రస్తుతం ప్రతీ కొత్త సినిమాను అమెజాన్ ప్రైమ్ లో అతి కొద్ది రోజుల్లోనే స్ట్రీమ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇలాంటిదే ఒక వార్త మహర్షి విషయంలో బయటకు వచ్చింది.మహర్షి సినిమా విడుదలైన నెల రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుందని సమాచారం.ఇది మాత్రం మహేష్ అభిమానులకు కాస్త కలవరపెట్టే వార్తనే చెప్పాలి.ఇప్పటికే నిర్మాణ సంస్థతో అమెజాన్ ప్రైమ్ వారితో ఒప్పందం కూడా కుదిర్చేసుకున్నారని తెలుస్తుంది.మరి ఈ వార్త విన్న మహేష్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.