ధోని పక్కన అమ్మాయి… తెలిసిపోయింది!

Monday, April 30th, 2018, 04:02:14 PM IST

మహేంద్ర సింగ్ ధోనిని కలిసే ఛాన్స్ వస్తే ఎవ్వరైనా సరే కలవడానికి ముందుంటారు. ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. రోజు రోజుకి అతనిపై అభిమానం చాలా పెరుగుతోంది. అయితే రీసెంట్ గా ధోని పక్కన ఎవరో హీరోయిన్ ఉందని సోషల్ మీడియాలో అందుకు సంబందించిన ఫొటో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆమె హీరోయిన్ కాదని తెలిసింది. మరెవరు అనుకుంటున్న సమయంలో మరొక ఫొటో ద్వారా సమాధానం దొరికింది.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ అని తెలిసింది. ధోనికి ఆమె వీరాభిమాని. ఎప్పటి నుంచో కలవాలని చూస్తున్నా అవకాశం దొరకలేదు. ఇక ఫైనల్ గా దీపక్ చాహర్ ని చెన్నై జట్టు ఈ సారి కొనుగోలు చేయడంతో సోదరుడి సహాయంతో కలిసే ఛాన్స్ దొరికింది. ఇకపోతే చాహర్ మంచి ఆటగాడిగా ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా రీసెంట్ గా కాలికి గాయమవ్వడంతో రెండు వరాల పాటు అతను ఆటకు దురవుతున్నట్లు కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments