మహేష్ పరుగులు పెట్టిస్తున్నాడు !

Wednesday, November 8th, 2017, 04:30:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజా సేవలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. శ్రీమంతుడు చిత్రం తరువాత మహేష్ తన సొంత గ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిధులకు తన సొంత నిధుల్ని కూడా జత చేసిన మహేష్ బుర్రిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కాగా మహేష్ తెలంగాణలో కూడా సిద్ధాపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ గ్రామంలో కూడా ప్రభుత్వ సహకారంతో మహేష్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు. తమ గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నర్సమ్మ అన్నారు. మహేష్ బాబు దత్తత తీసుకున్న తరువాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆమె వివరించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నత పాఠశాల నిర్మాణానికి రూ 85 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. బస్సు షెల్టర్, మరుగుదొడ్ల నిర్మాణం. పాఠశాలలో డిజిటల్ క్లాసు రూమ్ ల నిర్మాణం జరుగుతోంది. ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ల ఏర్పాటుకు కూడా మహేష్ నిధులు కేటాయించారు. మహేష్ ఆ గ్రామంలో పర్యటించనప్పటికీ ఆయన సతీమణి నమ్రత పర్యటించారు.

  •  
  •  
  •  
  •  

Comments