విదేశాలకు .. మహర్షి అండ్ టీమ్ ?

Saturday, September 1st, 2018, 10:06:16 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా ఏకధాటిగా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంది. గత కొన్ని రోజులుగా హైద్రాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ టీమ్ తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. అమెరికా, న్యూ యార్క్, కాలిఫోర్నియా, లాస్ వేగాస్ లాంటి ప్రాంతాల్లో ప్లాన్ చేసారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే షూటింగ్ జరగనుందట. కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్న ఈ టీమ్ వచ్చే వారంలోనే విదేశాలకు వెళ్ళనుంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. వినాయక చవితి సందర్బంగా టీజర్ ని కూడా విడుదల చేస్తారట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయనున్నారు. ఇక మహేష్ హీరోగా తెరకెక్కే 26 వ సినిమాకోసం దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments