సరికొత్త రికార్డు సొంతం చేసుకున్న మహేష్ బాబు

Saturday, January 12th, 2019, 04:50:58 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక వైపు సినిమాల్లో దూసుకుపోతూనే మరో వైపు ఎన్నో ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. సినిమాల్లో ఎన్నో అవార్డులను, పాపులారిటీలను సొంతంచేసుకున్న ఆయన సినిమాలే కాక వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టిన సంగతి మనకు ఎలిసిందే.

సెలెబ్రిటీల మార్కెట్ ను బట్టి, వారి పాపులారిటీని బట్టి టాప్ ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమించుకుంటుంటాయి. మార్కెట్ బాగుంటే ఆదాయం బాగుంటుంది. మార్కెట్ విషయం లో మాత్రం మహేష్ బాబు టాప్ లో ఉన్నాడు. మన సౌత్ స్టార్స్ లలో మహేష్ బాబు పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ విషయంలో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు దాదాపుగా 15 బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. ప్రోడక్ట్స్ అంబాసిడర్ గా ఉంటూ.. మరోవైపు సినిమా నిర్మాణంలోను, మల్టీప్లెక్స్ థియేటర్స్ రంగంలోనూ బిజీగా ఉండటం విశేషం.