ఫొటో టాక్: మహేష్ కొత్త లుక్ అదిరింది!

Wednesday, June 6th, 2018, 11:37:39 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు ఊహించని విధంగా కనిపించాడు. ఎప్పుడు సాఫ్ట్ లుక్ తో కనిపించే మహేష్ మొదటి సారి గెడ్డం లుక్ లో కనిపించాడు. కెరీర్ లో లుక్ పరంగా పెద్దగా ప్రయోగాలు చేయని మహేష్ మొదటి సారి గెడ్డం పెంచేశాడు. ఇన్ని రోజులు సీక్రెగ్ గా మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఎయిర్ పోర్ట్ లో ఒక్కసారిగా మీడియా కంట పడేసరికి లుక్ బయటకు వచ్చింది. మహేష్ తన లుక్ తో అందరికి షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ అభిమానులు అందుకు సంబందించిన పోటోలను తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. దిల్ రాజు – అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments