మహేశ్ బాబుకి రాజకీయాలు అవసరమా? కంట్రోల్ అవ్వండి!

Tuesday, September 26th, 2017, 08:50:25 AM IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లో అతని మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు కూడా చేసాడు. రాజకీయాల్లో తన తండ్రికి, వైఎస్ఆర్ కి మంచి అనుబంధం ఉందని, తనకు కూడా మంచి సాన్నిహిత్యం ఉందని అన్నాడు. మహేశ్ బాబు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వారికి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆలోచిస్తే. ఏదో సందర్భంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లు ఉంది. ఇంత వరకు ఒకే. అసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికీ ఎ అవకాశం వస్తుందా, ఎవరి ఇమేజ్ ని ఇలా వాడుకున్దామా అనే ఆలోచనతో ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మహేశ్ బాబు మాటలని వాడుకునే అవకాశం వైసీపీకి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది.

మహేశ్ బాబు బావా గలా జయదేవ్ ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను గుంటూరు నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్లమెంటు సభ్యుడుగా ఉన్నాడు. మరో వైపు మహేశ్ పెదనాన్న ఆదిశేషగిరి రావు, వైసీపీ పార్టీ మద్దతుదారుడుగా మొదటి నుంచి ఉన్నాడు. గత నంద్యాల ఉప ఎన్నికల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మద్దతు వైసీపీకి ఉంటుందని ఆయన బహిరంగంగా ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ తమకు సపోర్ట్ చేస్తుందని, వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో దించాలనే ఆలోచనకి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో మహేశ్ బావ కూడా ఫ్రేమ్ లోకి వచ్చి మహేశ్ సపోర్ట్ తెలుగు దేశం పార్టీకి ఉందని చెప్పడం జరిగింది. అయితే మహేశ్ ఎవరికీ సపోర్ట్ చేశా అనే విషయం ఎప్పుడు ప్రస్తావించలేదు.

ఇలాంటి పరిస్థితిలో మరల మహేశ్ రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తూ తనకు వైఎస్సార్ భాగా అనుబంధం ఉందని, జగన్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడం బట్టి ఇప్పుడు అది వైసీపీకి పరోక్షంగా తన మద్దతు ఉంటుందని చెప్పడం లాంటిదే అని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ సపోర్ట్ వైఎస్ జగన్ కి ఉంటుందని ప్రచారం చేసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిలో గల్లా జయదేవ్ కాస్తా కార్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూసే చంద్రబాబుకి మహేశ్ మాటలు కాస్తా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. ఈ పరిస్థితిలో జయదేవ్ తో మాట్లాడి ఆ మాటలపై స్పష్టత ఇమ్మని కోరే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మహేశ్ రాజకీయ వాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఎంత వరకు వెళ్తాయి అనేది కాలమే నిర్ణయించాలి.

  •  
  •  
  •  
  •  

Comments