దిల్ రాజు”పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్.!

Friday, March 15th, 2019, 07:04:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పైడిపల్లి వంశీ దర్శకత్వంలో “మహర్షి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసినదే..ఈ సినిమాని సి కళ్యాణ్ మరియు దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసినదే.ఎప్పుడో విడుదలైన ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్లు వదలకపోవడంతో మహేష్ అభిమానులు ఇప్పుడు కాస్త గరంగరం గానే ఉన్నారు.అప్పుడెప్పుడో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక చిన్న టీజర్..అది టీజర్ కూడా కాదు కేవలం మహేష్ కి బర్త్ డే విష్,ఆ తర్వాత మొన్న కొత్త సంవత్సరం సందర్భంగా ఒక పోస్టర్ అంతే ఇవి తప్ప మహేష్ అభిమానులకు చెప్పుకోడానికి ఏ అప్డేట్స్ లేవు దానికి తోడు వీరికి సినిమా విడుదల తేదీ పట్ల వచ్చిన కన్ఫ్యూజన్ కూడా అంతా ఇంతా కాదు.

దానితో ఈ సినిమా టీజర్ కావాల్సిందే అని మహేష్ అభిమానులు ట్విట్టర్లో ఒక ట్రెండ్ కూడా చేసి పారేసారు.ఇప్పుడు ఇంకా ఈ సినిమా విడుదలకి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండడంతో టీజర్ కాదు కానీ ఏదొక అప్డేట్ ఇవ్వండి అంటూ కొంత మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే..మరికొంత మంది దిల్ రాజుపై ఫైరవుతున్నారు.తాను నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్ 2 సినిమా తాలూకా డిలీటెడ్ సీన్లు విడుదల చేస్తున్నారు కానీ మహర్షి సినిమా కోసం ఒక్క అప్డేట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.ఇప్పటికే ఎంతో కాలం నుంచి ఓపిక పట్టి ఎదురు చూస్తున్నారు.ఇలా ఎంత కాలం అని ఎదురు చూస్తారు.సహనానికి అంటూ ఒక హద్దు ఉంటుంది కదా.మరి వీరి ఆవేదనను అర్ధం చేసుకొని ఏదన్నా అప్డేట్ త్వరగా ఇస్తే అంత మంచిది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదల కానుంది.