మహర్షి..భారీ రికార్డ్ కొట్టేందుకు ఫ్యాన్స్ ప్లాన్స్..!?

Wednesday, November 21st, 2018, 02:18:49 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం మహర్షి.
అయితే ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.భరత్ అనే నేను చిత్రం ఇచ్చిన బూస్ట్ తో మహేష్ మరింత హుషారుగా ఉన్నారు.తన అభిమానులకు ఎప్పుడు మంచి చిత్రాలను అందించాలని ప్రయత్నించే మహేష్ ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు.అయితే బాక్సాఫీస్ వద్ద మహేష్ రికార్డ్స్ సంగతి చూసుకుంటే యూట్యూబ్ రికార్డ్స్ మేము చూసుకుంటాము అని ఆయన అభిమానులు తెలుపుతున్నారు.అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు.ఈ చిత్రానికి సంబందించిన టీజర్ విడుదల సమయంలో మాత్రం ఎవ్వరు కొట్టని విధంగా రికార్డులు సృష్టించాలని భావిస్తున్నారు.టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 15 మిలియన్ వ్యూస్ మరియు 1 మిలియన్ లైక్స్ చేసి రికార్డు సృష్టించాలని సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే తమ తోటి అభిమానులను సిద్ధం చేస్తున్నారు.మరి వారు ఆ రికార్డును అందుకుంటారో లేదో వేచి చూడాలి.