మహేష్ బాబు అభిమాని ఆత్మాహత్యాయత్నం

Sunday, September 14th, 2014, 01:11:29 PM IST


ఈ నెల 19న విడుదల కాబోతున్న మహేష్ బాబు ఆగడు సినిమా కోసం విజయవాడనగరంలోని అలంకార్ దియేటర్ వద్ద 90 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ భారీ కటౌట్ కు అనుమతి లేదంటూ, వెంటనే తొలగించాలని అధికారులు ఆదేశించారు. అక్కడకు చేసుకున్న అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడండతో.. మహేష్ బాబు అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కటౌట్ ను తొలగించేందుకు అభిమానులు ససేమిరా అనడంతో కాసేపు అలంకార్ సెంటర్ లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అధికారులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన మహేష్ అభిమాని ఒకరు.. ఆ 90 అడుగుల ఆగడు కటౌట్ మీద నుంచి కాలవలోకి దూకి తన నిరసన తెలియజేశాడు.